రకుల్ రెమ్యూనరేషన్ రెండున్నర కోట్లా ?!

వరుస విజయాలు అందుకొన్న అనంతరం హీరోయిన్లు రెమ్యూనరేషన్ పెంచడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. వరుస పరాజయాల తర్వాత కూడా రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా తగ్గకపోగా.. పైపెచ్చు ఇంకో కోటి పెంచేసింది. రకుల్ నటించిన రెండు సినిమాలు “జయ జానకి నాయక” ఫ్లాప్ అని బిజినెస్ సర్కిల్స్ లో డిక్లేర్ చేయబడగా.. ఈవారం విడుదలైన “స్పైడర్” కూడా ఇంచుమించు అదే స్థాయి టాక్ తెచ్చుకొంది. పైగా.. సినిమాలో రకుల్ రోల్ చాలా చిన్నది కావడం మాత్రమే కాక సెన్స్ అనేది లేకపోవడంపై విమర్శకులు కాస్త గట్టిగానే స్పందించారు.

అయితే.. వీటన్నిటినీ ఏమాత్రం పట్టించుకోని రకుల్ కోటిన్నర ఉన్న తన రెమ్యూనరేషన్ ను ఇప్పుడు రెండున్నర కోట్లు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాతోపాటు తమిళంలో సూర్యతో ఒక సినిమా ఒప్పుకొన్న రకుల్ కు ప్రెజంట్ తెలుగులో మంచి ప్రొజెక్ట్ ఏమీ లేదు. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోనైనా అమ్మడు రెమ్యూనరేషన్ ను ఏమాత్రం తగ్గించకపోగా.. కోటి రూపాయలు పెంచి స్టార్ హీరో సినిమా అయినప్పటికీ కాంప్రమైజ్ అవ్వకపోవడంతో ఆమె మేనేజర్ కు కొత్త కష్టాలొచ్చాయ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus