Rakul Preet Singh: రకుల్ ప్రీతిసింగ్ చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు.!

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ క్రేజీ మూవీ దాదాపు పూర్తయ్యింది. రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ రెండు పాటల్లో ఒక పాట స్పెషల్ సాంగ్. ఈ పాటను పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి పై చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రేజీ మూవీని జులై 28న విడుదల చేయనున్నారు. ఈ మూవీలో రకుల్ కు ఐటెంసాంగ్ ఛాన్స్ పట్టేసిందని టాక్ నడుస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి కావస్తున్న ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయట. అందులో ఒకటి ఐటెంసాంగ్ అని టాక్. ఇక ఈ సాంగ్ లో హీరోయిన్ కోసం మేకర్స్ జల్లెడ పట్టి చివరకి రకుల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇక సోమవారం షూటింగ్ స్టార్ట్ చేద్దామని అన్ని సెట్ చేసి పెట్టాకా మేకర్స్ కు రకుల్ పెద్ద షాక్ ఇచ్చిందట. డేట్లు అడ్జస్ట్ కావడం లేదని..కుదిరితే కొత్త డేట్లో ప్లాన్ చేసుకోండని అమ్మడి సంకేతాలు పంపిందిట. దీంతో పవన్ ఫ్యాన్స్ రకుల్ పై మండిపడుతున్నారు. అవకాశాలు లేనప్పుడు.. అందులోను పవన్ పక్కన ఛాన్స్ వస్తే.. ఇలాంటి కబుర్లు చెప్పకూడదు.. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం కాదు.. వేరే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనైనా చేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు.

రకుల్ (Rakul Preet Singh) ఇలా చెప్పడంతో మేకర్స్ రకుల్ ను తీసేసి కొత్త భామని తీసుకోవాలా? అన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. రకుల్ అయితే బాగుంటుందని టీమ్ భావిస్తున్నా.. ఆమెకు సమయం కుదరకపోవడంతో సన్నివేశం మరోలా టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus