Rakul Preet Singh: ప్రతిరోజూ కొత్తగా ఉంటోంది.. రకుల్ వ్యాఖ్యలు!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అఫీషియల్ గా తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది కానీ ఆ తరువాత రకుల్-జాకీ బయట పెద్దగా కనిపించలేదు. ఇదే ప్రశ్న రకుల్ కి ఎదురైంది. ప్రేమలో ఉన్న చాలా మంది హీరో, హీరోయిన్లు ఓపెన్ గా బయట తిరుగుతుంటే..

Click Here To Watch

అధికారికంగా ప్రకటించి కూడా ఎందుకు పబ్లిక్ లో కనిపించడం లేదని రకుల్ ని ప్రశ్నించగా.. దానికి ఆమె ఎలా రియాక్ట్ అయిందంటే.. ‘నేను జాకీ ఒకేలా ఆలోచిస్తాం. ప్రతిది బయటపెట్టాలనే మనస్తత్వం కాదు మా ఇద్దరిది. మా డేటింగ్ లైఫ్ ను సింపుల్ గా ఉంచాలనుకుంటున్నాం. ఫుడ్, జిమ్, జీవితాన్ని చూసే విధానంలో మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నిజంగా డేటింగ్ గురించి మాట్లాడాలనిపిస్తే, సరైన టైమ్ లో మళ్లీ స్పందిస్తాం’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇలా జాకీతో తన డేటింగ్ లైఫ్ గురించి మాట్లాడింది రకుల్. బాయ్ ఫ్రెండ్ తో ప్రతిరోజూ కొత్తగా ఉంటుందన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తామిద్దరం ఓ అందమైన ప్రపంచంలో విహరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఫ్యూచర్ లో తమ లవ్ మేటర్ కి సంబంధించిన విషయాలను మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఇద్దరం చర్చించుకొని సోషల్ మీడియాలో చెబుతామని తెలిపింది. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో చివరిగా ఆమె ‘కొండపొలం’ సినిమాలో కనిపించింది.

ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. కానీ బాలీవుడ్ లో అరడజనుకి పైగా సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus