Rakul Preet Singh: ‘భారతీయుడు 2’లో తన పాత్ర గురించి చెప్పిన రకుల్‌.. అయితే…

‘భారతీయుడు 2’ (Indian 2) సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది అనే విషయం మీకు తెలిసిందే. సినిమా అనౌన్స్‌ చేసిన కొత్తల్లో కమల్‌  (Kamal Haasan) సరసన నటిస్తుందేమో అనుకున్నారంతా. అయితే పాత్రల గురంచి తెలిశాక కూడా ఎవరి పక్కన నటిస్తోంది అనే విషయం క్లారిటీ రాలేదు. కానీ ఇటీవల ఓ పాట రిలీజ్‌ చేయడంతో పూర్తి స్పష్టత వచ్చింది. అయితే తన పాత్ర గురించి రకుల్‌ ఏమన్నా చెబుతుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మీడియా ముందుకొచ్చిన ఆమె అసలు విషయం చెప్పకుండా వెళ్లిపోయింది.

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ (Shankar) తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ సినిమా జులై 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సిద్ధార్థ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) నటించింది. ఈ సినిమాలో కాజల్ ఓ కీలక పాత్రధారి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్‌ మాట్లాడుతూ తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాల్లో ఇది ఒకటిగా ఉండిపోతుంది అని ఆమె తెలిపింది.

ఇప్పటివరకు తాను నటించిన సినిమాల కంటే ఈ సినిమాలోని తన పాత్ర భిన్నంగా ఉంటుందని రకుల్‌ చెప్పింది. ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా ఈ సినిమాలో కనిపిస్తానని, అనుకున్న పనిని ఎలా అయినా సాధించే యువతి పాత్ర చేశాను అని చెప్పింది. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు… నిజజీవితానికి దగ్గరగా ఉన్నాను అనిపించేది అని రకుల్‌ పేర్కొంది.

అంతేకాదు ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నానని, కానీ ఇప్పుడే చెప్పలేను అని ఉసూరుమనిపించింది. ఈ సినిమా కాకుండా రకుల్‌ సౌత్‌లో ఇంకే సినిమాలు చేయడం లేదు. అయితే బాలీవుడడ్‌లో ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే 2’ (De De Pyaar De) సినిమా చేస్తోంది. తొలి సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వచ్చే ఏడాది మే 1న ఈ సినమా రిలీజ్‌ అవుతుందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus