Rakul Preet: హాట్ టాపిక్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కార్డ్..!

రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఆమె నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉంది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుంది. గోవాలో వీరి వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వినికిడి. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ..ల వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని డిజైన్ అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. కార్డు పై ‘రకుల్ అండ్ జాకీ’ అని ప్రింట్ చేయడానికి మనం గమనించవచ్చు.

తెలుపు-నీలం.. రంగుల కలయికలో ఈ వెడ్డింగ్ కార్డుని డిజైన్ చేయడం జరిగింది. గోవాలో రకుల్- జాకీ..ల పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే.గోవాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బీచ్, కొబ్బరి చెట్లు వాతావరణాన్ని తలపించే విధంగా కూడా ఈ వెడ్డింగ్ కార్డు ఉందని చెప్పవచ్చు.3 రోజుల పాటు రకుల్- జాకీ..ల పెళ్లి సంబరాలు జరుగుతాయి. సబ్యసాచి, తరుణ్ తహిలియానీ, మనీష్ మల్హోత్రా వంటి ఫేమస్ డిజైనర్లు తయారుచేసే కాస్ట్యూమ్స్ లో ఈ జంట కనిపించనుంది.

గోవాలోనే (Rakul Preet) రకుల్ -జాకీ..ల ప్రేమ కథ మొదలైంది. కాబట్టి..తమ పెళ్లి వేడుకను కూడా ముందుగానే అక్కడ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రకుల్ సినీ కెరీర్ విషయంలో చాలా అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లయ్యాక కూడా రకుల్ సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే రకుల్ మాత్రం ఇంకా వీటిపై క్లారిటీ ఇవ్వలేదు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus