Ram Charan: ఉత్తరాంధ్ర భాషలో మాట్లాడటం వచ్చా..చరణ్ మూవీలో ఛాన్స్ మీకే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే పూర్తి చేసుకుని అనంతరం తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా కూడా ప్రకటించారు. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేసుకోబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో నటించడానికి నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. అయితే (Ram Charan) రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం పొందాలనుకునే వారికి డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం మీకు ఉత్తరాంధ్ర భాషలో మాట్లాడటం వస్తే చాలు చరణ్ సినిమాలో నటించే అవకాశాన్ని పొందవచ్చని తెలియజేశారు. ఆంధ్ర భాష మాట్లాడటానికి వచ్చేవారు ఒక నిమిషం ఉన్నటువంటి వీడియోని తమకు పంపించాలి అంటూ మేకర్స్ తమ ఐడిని పంపించారు. రీల్స్, సెల్ఫీ వీడియోలు పంపకూడదని వెల్లడించారు.

అలాగే మూడు ఫోటోలు, డీటెయిల్స్ కూడా మెయిల్ లో తెలియజేయాలని మైత్రి మూవీ మేకర్స్ తమ అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎక్కువ భాగం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి వంటి ప్రాంతాలలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో నటించడానికి ఉత్తరాంధ్ర భాషలో మాట్లాడేవారు కావాలి అంటూ మేకర్స్ ఆడిషన్స్ కి పిలుపునిచ్చారు. మీకు ఈ భాష మాట్లాడటం వస్తే వెంటనే మేకర్స్ వెల్లడించిన ఐడి కి వీడియో పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus