Ram Charan, Buchi Babu: కొత్త సినిమా విషయంలో రామ్‌చరణ్‌ ఆ పని చేశాడా?

తారక్‌ నుండి బుచ్చిబాబు బయటకు వస్తున్నాడా? రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడా? అంటూ గత కొన్ని రోజులుగా ఈ విషయమ్మీ చర్చ నడిచింది. అనుకున్నట్లుగా బుచ్చిబాబు కొత్త సినిమా రామ్‌చరణ్‌తో అని టీమ్‌ ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో చర్చ నడుస్తోంది. తారక్‌ సినిమా చేయాల్సిన బుచ్చిబాబు ఎందుకు బయటకు వచ్చేశాడు, తారక్‌ సినిమాను రామ్‌చరణ్‌ తీసుకున్నాడా? అదీ ఇదీ ఒకటేనా అనే ప్రశ్న కూడా మొదలైంది. అయితే దీనిపై సోషల్‌ మీడియాలో వేరే చర్చ నడుస్తోంది.

‘ఉప్పెన’ సినిమాతో మంచి హిట్‌ కొట్టిన బుచ్చిబాబుకు ఎలాంటి కథనైనా సిద్ధం చేయగలరు అనే పేరు ఉంది. సుకుమార్‌ టీమ్‌లో ఆయన కీలక సభ్యుడు అని అంటుంటారు. అలాంటి దర్శకుడు తొలి సినిమా తర్వాత రెండో సినిమాకు చాలా గ్యాప్‌ వచ్చింది. దీంతో బుచ్చిబాబు కెరీర్‌లో కీలక డెసిషన్‌ విషయంలో లేట్‌ అవుతున్నాడు అని అన్నారు. ఎన్టీఆర్‌ లైనప్‌ చూసుకుంటే బుచ్చిబాబు సినిమా ఇప్పట్లో కష్టమే అనుకున్నారు. అయితే ఏం అర్థమైందో ఏమో బుచ్చిబాబు బయటకు వచ్చేశాడు.

అయితే ఈ ప్రాజెక్టును ఓకే చేసిన నిర్ణయంలో రామ్ చ‌ర‌ణ్ చూపించిన ప్రొఫెష‌న‌లిజం.. అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకుంది అంటున్నారు. దీనికి కారణం బుచ్చిబాబు సినిమాను ఓకే చేసినప్పుడు తారక్‌తో రామ్‌చరణ్‌ మాట్లాడాడు అని సమాచారం. ‘‘బుచ్చిబాబు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. నువ్వు ‘ఓకే’ అంటే నేనే ఓకే చేస్తా’’ అని అన్నాడట. దానికి ఎన్టీఆర్ ‘‘ఈ క‌థ ఇద్ద‌రిలో ఎవ‌రు చేసినా బాగానే ఉంటుంది. నువ్వు ఓకే అనుకుంటే ప్రొసీడ్‌ అయిపోయా’’ అన్నాడ‌ట‌.

అలా ఎన్టీఆర్ ప‌ర్మిష‌న్ తీసుకొన్న త‌ర‌వాతే రామ్‌ చ‌ర‌ణ్ ఈ సినిమాను ఓకే చేశాడ‌ని టాక్‌. రామ్‌చరణ్‌, తారక్‌ మధ్య ఉన్న అనుబంధం అలాంటిది మరి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సమయంలో ఈ విషయం ప్రేక్షకులకు తెలిసింది. చాలా రోజులుగా ఇద్దరూ మంచి మిత్రులు అని అప్పుడు తెలిసింది. ఆ స్నేహం కారణంగానే చరణ్‌.. తారక్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడనే మాట విన అభిమానులు కూడా ఆనందపడుతున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus