మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి… డిజాస్టర్ గా మిగిలింది. మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. బోయపాటి శ్రీను… హీరో ని… విలన్ ని ఎలివేట్ చేసే క్రమంలో కొంచెం దారి తపాడనే విమర్శలకు గురయ్యాడు. ఇక ఈ చిత్రం కనీసం 40 కోట్లయినా రాబడుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే రాంచరణ్ కి మాస్ లో గల పట్టుతో 60 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పాయి. అయినప్పటికీ 90 కోట్ల వరకు ప్రీ రిలీజ్ జరగడంతో 25 కోట్ల వరకూ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాల వారు తేల్చేసారు.
ఇక ఈ డిజాస్టర్ కి బాధ్యత వహిస్తూ.. ముందుకు వచ్చాడు హీరో రాంచరణ్. తాజాగా తన ఫ్యాన్స్ ని, మరియు ప్రేక్షకుల్ని నిరాశపరిచినందుకు… క్షమాపణలు చెబుతూ లేక రాసాడు. రాంచరణ్ తన లేఖ ద్వారా స్పందిస్తూ.. ”ప్రియమైన అభిమానులకు మరియు ప్రేక్షకులకు నా పట్ల మరియు నా సినిమాల పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనని, సినిమాను నమ్మిన పంపిణీదారులు, బయ్యర్లకు కృతజ్ఞుడనై ఉంటాను.
మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపజేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయాము. ప్రేక్షకులు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో అందరికీ నచ్చే సినిమాలు చేయటానికి కృషి చేస్తాను” అంటూ తన లేఖ ద్వారా పేర్కొన్నాడు రాంచరణ్. తన సినిమా ప్లాప్ అని.. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ రాంచరణ్ ముందుకు రావడం.. పట్ల తన నిజాయితీ ఎలాంటిదో చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు రాంచరణ్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.