Ram Charan, Mahesh Babu: ఫ్యాన్స్‌కి పండగ న్యూస్‌… రామ్‌చరణ్‌ – మహేష్‌ మధ్య బాండింగ్‌ చూశారా?

సినిమా హీరోల స్నేహం గురించి అన్ని విషయాలు మనకు తెలియవు? ఈ మాట అంటే ఎవరైనా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అయితే ఒకటి రెండు ఉదాహరణలు మేం చెప్పాక కచ్చితంగా నమ్ముతారు. అలా ఇద్దరు స్టార్‌ హీరోల స్నేహం గురించే ఇప్పుడు మేం చెబుతున్నాం. వాళ్లే రామ్‌చరణ్‌, మహేష్‌బాబు. యస్‌ మెగా పవర్‌స్టార్‌, సూపర్‌ స్టార్‌ గురించే మేం చెప్పేది. వీళ్ల కుటుంబాలు బాగా క్లోజ్‌ అని… కృష్ణ – చిరంజీవి కూడా బాగా క్లోజ్‌ అని అందరికీ తెలుసు.

అయితే ఒకరి చెప్పులు, మరొకరు వేసుకునేఅంతగా చరణ్‌, మహేష్ మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉందని తెలుసా? ఏంటీ.. ఒకరి చెప్పులు, మరొకరు వేసుకుంటారా? అనే డౌట్‌ వచ్చిందా? అయితే మొన్నీమధ్య దీపావళి సందర్భంగా మహేష్‌, చరణ్‌లు కలసిన ఫొటోలు కొన్ని షేర్‌ చేశారు కదా… అవి చూడండి మీకే ఐడియా వచ్చేస్తుంది. నిజానికి టాలీవుడ్‌లో టాప్ హీరోల మధ్య ఉన్న స్నేహం ఈ మధ్యే అందరికీ అర్థమవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నేపథ్యంలో రామ్‌చరణ్‌, తారక్‌ స్నేహం గురించి తెలిసింది.

ఇప్పుడు దీపావళి వేడుకలు వల్ల మహేష్‌తో చరణ్‌ ఫ్రెండ్షిప్ గురించి తెలిసింది. క్లీంకారా వచ్చాక మొదటి పండుగ కావడంతో మెగా ఫ్యామిలీ ఈ దీపావళిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. నాగార్జున, వెంకటేశ్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్… ఇలా అందరూ ఒక్క చోటే కనిపించడంతో ఫ్యాన్స్ చాలా సంబరపడ్డారు. అయితే అలా వచ్చిన ఫొటోల్లో ఓ ఫొటో చూసి మహేష్‌ – చరణ్‌ బాండింగ్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫొటోల్లో ఓ చోట మహేష్ బాబు వేసుకున్న చెప్పులు.. మరో చోట (Ram Charan) రామ్ చరణ్ వద్ద కనిపించాయి.

ఎవరి చెప్పులు ఎవరు వేసుకున్నారనేది తెలియదు కానీ.. ఇద్దరూ చెప్పులు మార్చుకునేంత క్లోజ్ ఫ్రెండ్సా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతోన్నారు. చరణ్‌ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్‌ రాత్రి పూట బయటకు వచ్చి షికార్లు తిరుగుతాడు అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారంలో తెలిసింది. ఇప్పుడు మహేష్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ తెలిసింది. ఇదంతా చూసి ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించడంతో చిరంజీవి వారసత్వాన్ని చరణ్‌ బాగానే ముందుకు తీసుకెళ్తున్నాడు అని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరికొందరైతే ఇప్పటి స్టార్లు సూపర్‌ అంటూ పొగిడేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus