బ్యాగులు మోస్తున్న మెగా పవర్‌స్టార్‌.. ఎంతటివారికైనా తప్పదంటూ…!

టాలీవుడ్‌ స్టార్‌ అయినా, పాన్‌ ఇండియా హీరో అయినా, గ్లోబల్‌ స్టార్‌ అయినా.. భార్య దగ్గర భర్తే. దీనిని ఎవరూ కాదనలేరు. ఆమెతో కలసి షాపింగ్‌కి వెళ్లినప్పుడు బ్యాగులు మోయాల్సిందే, చెప్పినట్లు వినాల్సిందే. ఈ విషయాన్ని మరోసారి చేసి చూపించాడు రామ్‌చరణ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’ పాట ఆస్కార్‌ బరిలో ఉండటంతో అమెరికాలో ప్రచారం చేస్తున్న చరణ్‌కి కాస్త గ్యాప్‌ ఇచ్చారు రాజమౌళి అండ్‌ టీమ్‌. దీంతో భార్య ఉపాసనతో కలసి షాపింగ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో దిగిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో ఓ షాపింగ్‌ మాల్‌లో ఉపాసన ముందు నడుస్తూ ఉంటే… ఆమె వెనుక చరణ్‌ నడుస్తున్నాడు. అయితే చేతిలో షాపింగ్ చేసిన బ్యాగ్‌లు భారీగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ ఫొటో చూసిన నెటిజన్లు.. పెళ్లయి అయిన ప్రతి మగవాడి పరిస్థితి ఇదే అంటూ ఫొటో కింద కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే ఆ బ్యాగులు మోయడంతో ఉన్న ఆనందం మీకేం తెలుసు అనే వాళ్లూ ఉన్నారు. కొంతమంది అయితే ఆ షాపింగ్‌కి బిల్‌ ఎవరు కట్టారు చరణ్‌ అని అడుగుతున్నారు కూడా. అన్ని బ్యాగులు మోస్తున్నాడు అంటే చరణే కట్టి ఉంటాడు.

ఇక ఆస్కార్‌ వేడుక ఈ నెల 12న లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతుంది. అంటే మన కాలమానం ప్రకారం 13న ఉదయం 5.30 తర్వాత ఉంటుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొన్న చరణ్‌, ఆ తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ వస్తున్నాడు. తారక్‌ అమెరికాలో ఎంటర్‌ అవ్వడంతో చిన్న గ్యాప్‌ తీసుకొని.. భార్యతో కలసి ఇలా షాపింగ్‌లు అని, సైట్‌ సీయింగ్‌లని చేస్తున్నాడు. త్వరలో తారక్‌, చరణ్‌ కలసి ఓ స్పెషల్ షోలో పాల్గొంటారని సమాచారం.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌ సినిమాకు నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం పూర్తికాగానే ఇండియా వచ్చి షూటింగ్‌లో పాల్గొంటారట. మార్చి 18, 19 తేదీల్లో చరణ్‌ – కియారా అడ్వాణీపై ఓ సాంగ్‌ షూట్‌ చేస్తారని సమాచారం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus