నిజమైన హీరోయిన్ అనిపించుకుంటున్న ప్రణీత…!

‘బాపు గారి బొమ్మ’ అన్నగానే మనకు ప్రణీతనే గుర్తొస్తుంది. బాపు గారు ఎన్నో బొమ్మలు గీసుండొచ్చు. కానీ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ప్రణీత ను బాపు గారి బొమ్మగా చూపించారు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది కాబట్టి… ఈమె ‘బాపుగారి బొమ్మ’ గా ఫేమస్ అయిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత ఈమెకు మరో హిట్టు పడలేదు. ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి కానీ సెకండ్ హీరోయిన్ గానో.. గెస్ట్ రోల్ గానో వస్తున్నాయి.

అయితే ఈమె మాత్రం ఇప్పుడు గొప్ప హీరోయిన్ అనిపించుకుంటుంది. మీరు మీరు వింటుంది నిజమే…! సినిమా అవకాశాలు ఈమెకు ఎక్కువ లేకపోవచ్చు… రాబడి కూడా ఎక్కువ లేకపోవచ్చు. కానీ నిజమైన హీరోయిన్ గా ప్రశంసలు అందుకుంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు.. మొదటగా ముందుకొచ్చిన హీరోయిన్ మన ప్రణీత సుభాషే. 50 పేద కుటుంబాలను ఆదుకుంది. ఇప్పటికి 75 వేల మందికి పైగా భోజనం పెట్టింది. ఇంకా పెడుతూనే ఉంది.

స్వయంగా ఆమెనే వంట చేసి.. పార్సిల్స్ చేసి మరీ పంచిపెడుతుంది. ఇప్పుడు ఆమె నిజాయితీకి… మానవత్వానికి .. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా హ్యాట్సాఫ్ కొట్టేసాడు. ‘గ్రేట్ వర్క్ మేడం’ అంటూ తన ట్విట్టర్ ద్వారా ప్రణీత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఆమె ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు రాంచరణ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమెకు మరింత ప్రశంసలు దక్కుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus