Ram Charan, Akhil: ‘ఏజెంట్’ టీం.. ‘విక్రమ్’ రేంజ్ ట్విస్ట్ ఇస్తారా..ఆ వీడియోకి అర్థమేంటి?

ఒక యూనివర్స్ క్రియేట్ చేసి అందులోని పాత్రలను పరిచయం చేసి ప్రమోట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అని దర్శకుడు లోకేష్ కనగరాజ్ చాటి చెప్పాడు. అతని యూనివర్స్ లో వచ్చిన ‘విక్రమ్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతో కమల్ హాసన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. నిర్మాతగా కూడా ఆయన భారీ లాభాలు పొందాడు.

మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో స్టార్ హీరో సూర్య.. గెస్ట్ రోల్లో వచ్చి ఆడియన్స్ ను వేరే లెవెల్ వరల్డ్ లోకి తీసుకెళ్లి ఫిదా చేసాడని చెప్పాలి. సరిగ్గా ఇదే ఫార్ములాని ‘ఏజెంట్’ చిత్రానికి కూడా అప్లై చేయబోతున్నారా అనే డౌట్ అందరిలో నెలకొంది. సడన్ గా ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని మీకు అనిపించొచ్చు. విషయమేంటంటే తాజాగా ‘ఏజెంట్’ టీం ఓ వీడియోని రిలీజ్ చేసింది.

‘ధృవ’ వెర్సస్ ‘ఏజెంట్’ అనే పేరుతో ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో రాంచరణ్ ..’ ‘ఏజెంట్’ ఎక్కడ అంటూ’ గంభీరమైన వాయిస్ లో పలుకుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘ధృవ’ చిత్రానికి కూడా దర్శకుడు సురేందర్ రెడ్డినే.. కాబట్టి ఇతను కూడా యూనివర్స్ క్రియేట్ చేసి ‘ఏజెంట్’ సినిమాలో రాంచరణ్ పాత్రను తీసుకొస్తాడా? అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

లేదు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లేదా.. (Ram Charan) చరణ్ తో ‘ఏజెంట్’ టీం ప్రమోషనల్ ఈవెంట్ ఏమైనా ఏర్పాటు చేశారా? అనే డౌట్ కూడా అందరికీ కలుగుతుంది. దీని పై ‘ఏజెంట్’ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ వీడియో వైరల్ అవుతుంది.


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus