పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండమని అభిమానులను కోరిన రామ్ చరణ్
- April 26, 2017 / 12:12 PM ISTByFilmy Focus
కొంతకాలంగా మెగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మద్దతు తెలపాలా? వద్దా?. ఎందుకంటే మెగా కుటుంబ సభ్యులందరూ ఒక వైపు ఉంటే .. పవన్ ఒక వైపు ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ దూరం పెరిగిందనే వార్త వ్యాపిస్తోంది. ఫ్యాన్స్ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తన పూర్తి మద్దతు ఉందని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకు మరింత ఉత్సహాన్ని ఇచ్చారు. అతను సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ పోలవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడకు వచ్చిన చెర్రీని అభిమానులు చుట్టుముట్టారు. వారితో కాసేపు చరణ్ మాట్లాడారు.
“బాబాయ్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన సమ్మర్ ను సైతం లెక్క చేయకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. బాబాయ్ ఏ కార్యక్రమం చేసినా ఆయన వెన్నంటే ఉండాలి. రాజకీయ పరంగానైనా..ఇంకేదైనా.” అని అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో పవన్ కి మద్దతు తెలుపమని చిరంజీవి మాటగా, చరణ్ చెప్పారని అందరూ భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















