Ram Charan: శంకర్‌ కోసం మళ్లీ మారిపోయిన రామ్‌చరణ్‌.. ఈసారీ ఆయనే!

దర్శకుడు శంకర్‌ సినిమా అంటే.. భారీతనమే కాదు, హీరోల లుక్‌లో వైవిధ్యమూ ఉంటుంది. సగటు సినిమా తీసినట్లు కనిపించినా హీరోను మాత్రం కొత్తగా చూపిస్తారు. డిఫరెంట్‌ లుక్స్‌, స్టైల్స్‌, క్రాఫ్స్‌.. ఇలా చాలా ఉంటాయి ఆయన సినిమాలో. గతంలో శంకర్‌ చేసిన సినిమాలు చూస్తే.. అన్ని లుక్స్‌లోనూ హీరోలు అద్భుతంగా కనిపిస్తారు. ఇప్పుడు అదే రీతిలో రామ్‌చరణ్‌ కూడా డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. అతని జోరు చూస్తుంటే ఇలాంటి లుక్స్‌ చాలానే ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలసిందే. కెరీర్‌లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ విషయం అధికారికంగా చెప్పలేదు కానీ.. ఇప్పటివరకు లీక్‌ అయిన లుక్స్ చూసి ఎవరైనా ఈ విషయం చెప్పేయొచ్చు. గోదావరి జిల్లాల్లో షూట్‌ చేసిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో చరణ్‌ 80 – 90ల నాటి యువకుడిలా కనిపించాడు.

సినిమా ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌, మరికొన్ని లీక్డ్‌ ఫొటోస్‌లో చరణ్‌ మరో లుక్‌లో కనిపించాడు. అయితే తాజాగా మరో కొత్త క్రాఫ్‌లో దర్శనమిచ్చాడు రామ్‌చరణ్‌. మొన్నటివరకు చరణ్ లాంగ్ హెయిర్‌తో సినిమా చేసాడు. కానీ ఇప్పుడు హెయిర్ స్టైలిస్ట్ అలీమ్‌ హకిమ్ సరికొత్త హెయిర్ స్టైల్ లుక్‌ను సిద్ధం చేశాడు. ఈ మేరకు చరణ్‌ను ప్రిపేర్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో అసలు చరణ్‌ ఈ సినిమాలో ఎన్నిరకాల లుక్స్‌లో కనిపిస్తాడు అంటూ చర్చ మొదలైంది. పైన చెప్పుకున్నట్లు శంకర్‌ సినిమా అంటే హీరోకు డిఫరెంట్‌ లుక్స్‌ ఉంటాయి. సినిమా కథలో ఓ లుక్‌లో చూపిస్తే.. పాటల్లో మరో లుక్‌లో చూపిస్తారు శంకర్‌. ఈ నేపథ్యంలోనే చరణ్‌ రకరకాల క్రాఫ్‌లు ట్రై చేస్తున్నాడు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాత్రి సమయంలో చార్మినార్‌ దగ్గర సాగుతోందని టాక్‌.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus