Ram Charan: ఎంత చెప్పినా టెంప్ట్ అవ్వని రామ్ చరణ్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరగా వినయ విధేయ రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ రిజల్ట్ ను మరచిపోయే విధంగా RRR తో పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నాడు.అల్లూరీ సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో ఆకట్టుకొనున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా ఫార్మాట్ ను కొనసాగించాలని తారక్, త్రివిక్రమ్ ను సైతం పక్కన పెట్టేసి కొరటాల, ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టారు. పాన్ ఇండియా మార్కెట్ కు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకూడదని తారక్ అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక రామ్ చరణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ తో పాన్ సినిమా సెట్టయినప్పటికి ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకపోవచ్చని సమాచారం. ఎందుకంటే శంకర్ ఇండియన్ 2 కాంట్రవర్సీలో బలంగా చిక్కుకుపోయాడు.

అయితే ఎలాగూ శంకర్ తో సినిమా అలస్యమవుతుంది కాబట్టి ఖాళీగా ఉండే బదులు మధ్యలో తెలుగులోనే ఏదైనా కమర్షియల్ సినిమా చేయమని సలహా ఇస్తున్నారట. ఆ మధ్య వెంకీ కుడుములతో అన్నారు. అలాగే అనిల్ రావిపూడి కూడా కథ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఎవరు చెప్పినా కూడా చరణ్ వినే మూడ్ లో లేడట. చేస్తే మళ్ళీ పాన్ ఇండియా ప్రాజెక్టునే పట్టాలని చూస్తున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus