Ram Charan: సంక్రాంతికి డౌటే కానీ.. డబుల్ ఫీస్ట్ గ్యారెంటీ అట!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ తో రాంచరణ్ కు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది కాబట్టి.. శంకర్ మూవీ పక్క దేశాల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బడ్జెట్ లెక్కలు అనుకున్నదానికంటే మించినా ఆయన వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే ఇది ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందుతున్న 50 వ చిత్రం కాబట్టి.!

అదే వేరే నిర్మాత అయితే శంకర్ దెబ్బకు ప్రాజెక్టు ఆపుకుని కూర్చునేవారు. షూటింగ్ ఆల్రెడీ 60 శాతం ఫినిష్ అయ్యింది. అయినా ఇంకా టైటిల్ ఏంటనేది రివీల్ చేయలేదు. ఈ విషయంపై తాజాగా దిల్ రాజు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘బలగం’ సినిమా ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్- శంకర్ ల సినిమా పై స్పందించారు.

” దర్శకులు శంకర్ గారు టైటిల్ లోగోని డిజైన్ చేయిస్తున్నారు. రాంచరణ్ పుట్టినరోజు నాడు ఈ టైటిల్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేస్తారు. జూన్, జూలై నాటికి షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు 6 నెలల వరకు టైం పడుతుంది. సంక్రాంతికి రావడానికి ట్రై చేస్తున్నాం. అది గ్యారెంటీ అని నేను చెప్పలేను” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే బుచ్చిబాబుతో చరణ్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ లేదా ఓ లుక్ పోస్టర్ ను కూడా ఆరోజే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus