Ram Chara: చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. ఇంకా కలలోనే ఉన్నానంటూ?

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఈ సాంగ్ లోని చరణ్, తారక్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు హీరోలు ఈ సాంగ్ ను పర్ఫెక్ట్ గా డ్యాన్స్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం గురించి రామ్ చరణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో మళ్లీ డ్యాన్స్ చేయాలని ఉందని చరణ్ చెప్పుకొచ్చారు.

మా జీవితాల్లో మాత్రమే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఆర్.ఆర్.ఆర్ మూవీ స్పెషల్ అని రామ్ చరణ్ అన్నారు. ఈ సాంగ్ కు ఆస్కార్ సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆయన కామెంట్లు చేశారు. నేనింకా కలలోనే ఉన్నాననే భావన కలుగుతోందని రామ్ చరణ్ పేర్కొన్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో రాజమౌళి, కీరవాణి విలువైన రత్నాలు అని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్.ఆర్.ఆర్ లాంటి మాస్టర్ పీస్ లో నన్ను భాగం చేసిన వాళ్లిద్దరికీ ధన్యవాదాలు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు అనే సాంగ్ ఒక ఎమోషన్ అని చరణ్ పేర్కొన్నారు. ఆ ఎమోషన్ కు రూపం ఇచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు అని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నా బ్రదర్ ఎన్టీఆర్ కో స్టార్ అలియా భట్ కు ధన్యవాదాలు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ తో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులను క్రియేట్ చేయాలని ఆశ పడుతున్నానని రామ్ చరణ్ అన్నారు. మన దేశానికి చెందిన నతీనటులందరికీ ఈ అవార్డ్ సొంతమని మాకు ఎంతగానో సపోర్ట్ అందించిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు అని రామ్ చరణ్ తెలిపారు. రామ్ చరణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ కామెంట్లు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus