Ram Charan: కమల్‌ టీజర్‌… చరణ్‌ ఫ్యాన్స్‌ గుండెల్లో గుబులు.. ఏమైందంటే?

టైటిల్‌ చూసి ఈ వార్తలోకి మీరు వచ్చారా? అయితే మీకు వచ్చే ఫస్ట్‌ డౌట్‌ ‘కమల్ హాసన్‌ సినిమా టీజర్‌ వస్తే.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ గుండెల్లో గుబులు ఎందుకొస్తుంది’ అని. అవునా మీ ప్రశ్న ఇదేనా? ఒకవేళ ఇదే అయితే ఆ రెండు సినిమాల దర్శకుడు ఒక్కరే కాబట్టి అనేది మా సమాధానం. అవును మేం చెబుతున్నది ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించే. ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు శంకర్‌ గురించే ఈ చర్చ.

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు కానీ… సినిమా అయితే పూర్తయిపోయింది త్వరలో వస్తుంది అని మాత్రం చెప్పొచ్చు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది టీమ్‌. కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు సందేశంలో దేశంలోని వివిధ భాషల సినిమాల నుండి స్టార్‌ నటులను తీసుకొని మరీ ప్రచారం చేశారు. అయితే టీజర్‌లో ఆ స్థాయి స్టఫ్ లేదు అనే మాట వినిపిస్తోంది.

‘భారతీయుడు 2’ సినిమా టీజర్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా రోజుల నుండి వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ ఎలా కనిపిస్తాడు, ఏం చేస్తాడు అంటూ ఆరాలు తీస్తున్నారు. అనుకున్నట్లుగానే టీజర్‌ వచ్చేసింది. అందులో కమల్‌ను చూసి ఇదేంటి ఇలా ఉన్నాడు? వయసు లెక్క ఏదో తేడా కొడుతోందే అని అనుకుంటున్నారు కూడా. ఇక ఆ విషయం పక్కనపెడితే సినిమాలో భారీతనం కనిపించినా… అది అంతలా మెప్పించేలా లేదు. ఇంక నేపథ్యం సంగీతం సంగతి సరేసరి.

దీంతో ఇదే శంకర్‌ దర్శకత్వంలో (Ram Charan) రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సినిమా ఎలా ఉంటుంది అనే డౌటానుమానం ప్రేక్షకులు, అభిమానుల్లో కలుగుతోంది. సరైన హీరోను సరిగ్గా చూపించకపోతే, సినిమా తేడా కొడితే కష్టం అంటూ లెక్కలేస్తున్నారు. అయిత శంకర్‌ సినిమా ప్రత్యేకతను టీజర్‌, ట్రైలర్‌లో చూపించేది కాదు అని ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus