Mahesh Babu: ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ వంతు.. అనౌన్స్మెంట్ కోసం కూడా పడిగాపులు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  హీరోగా శంకర్ (Shankar)  దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’  (Game Changer)   అనే సినిమా రాబోతుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతుంది ఈ సినిమా. వాస్తవానికి 2021 చివర్లో మొదలైన ప్రాజెక్ట్ ఇది. కానీ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కానీ.. దర్శకుడు శంకర్ ఇప్పటికీ ఈ చిత్రాన్ని చిక్కుతునే ఉన్నాడు. ఒక్కో షాట్ 20 , 30 సార్లు తీసి తీసి హీరో చరణ్ కి ఇరిటేషన్ తెప్పించాడు శంకర్ అంటూ ఇన్సైడ్ టాక్ వినిపిస్తూనే ఉంది.

Mahesh Babu

అప్డేట్స్ వంటివి కూడా ఇవ్వనివ్వకుండా అతను ఫ్యాన్స్ కి నరకం చూపించాడు అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదైతేనేం.. మరో రెండు నెలల్లో చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పడనుంది.చూస్తుంటే మరోవైపు మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్లేస్ కి వచ్చినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

మహేష్ కెరీర్లో 29 వ సినిమాగా రూపొందనుంది ఈ సినిమా. అయితే ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇంకా రాలేదు. కానీ ఇంకో వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ స్టార్లు ఈ ప్రాజెక్టుకి ఎంపిక అయినట్టు టాక్ నడుస్తుంది. కానీ రాజమౌళి కానీ, నిర్మాతలు కానీ ఆ విషయం పై క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇంకో వైపు రాజమౌళి తనయుడు. యూనిట్ డైరెక్టర్ అయినటువంటి కార్తికేయ లొకేషన్స్ వేటలో పడ్డాడు. అతను రోజుకో ఫోటో పెట్టి మహేష్ అభిమానులను ఊరిస్తున్నాడు. అతను పోస్ట్ చేసే ఫోటోలపై మహేష్ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఏదేమైనా వారికి ఇంకో 3 ఏళ్ళ పాటు ఇలాంటి టెస్టులు తప్పవనే చెప్పాలి.

దేవిశ్రీప్రసాద్‌ పాటకు అనిరుథ్‌ డ్యాన్సట… ఇదెక్కడి మాస్‌ మామా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus