Ram Charan: చరణ్ ఫోకస్ షిఫ్ట్.. బుచ్చిబాబుతో బిజీబిజీగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన కెరీర్‌లో మళ్ళీ ఉహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నాడు. సోలో సక్సెస్ కొట్టే ప్రయత్నంలో ఉన్న చరణ్ 2018లో వచ్చిన రంగస్థలంతో (Rangasthalam) తన స్టామినాను చూపించినప్పటికీ, ఆ తర్వాత చేసిన వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama), ఆచార్య (Acharya) వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఎన్టీఆర్‌తో (Jr NTR) కలిసి చేసిన RRR భారీ విజయాన్ని అందించినా, సోలోగా చేసిన గేమ్ ఛేంజర్ (Game changer) చిత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేదు. దర్శకుడు శంకర్ (Shankar) రూపొందించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ మిక్స్ డ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను ఆకట్టుకోలేకపోయింది.

Ram Charan

400 కోట్లు రాబట్టాల్సిన ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్లు అందుకోవడం కూడా కష్టంగా మారింది. చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమాగా వచ్చినప్పటికీ, ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. దిల్ రాజుకి (Dil Raju) కూడా ఇది బిగ్ లాస్ ప్రాజెక్ట్. అనుకోని కారణాల వలన ఈ సినిమా మూడు సంవత్సరాలకు పైగా షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ కథ, స్క్రీన్‌ప్లే లోపాలు ఉండటం వల్ల సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానాతో (Buchi Babu Sana) చేయబోయే సినిమా మీదే పూర్తి ఫోకస్ పెట్టారు. త్వరలోనే మరో కీలక షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ షూటింగ్ కోసం ముందుగా వర్క్ షాప్ లో పాల్గొననున్నారని టాక్. RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఎమోషనల్ టచ్ ఉన్న స్టోరీని రెడీ చేశారు. ఉప్పెనతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబుపై మెగా ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. చరణ్ గేమ్ ఛేంజర్ మూడ్ నుంచి బయటకు వచ్చి సైలెంట్ గా తన తదుపరి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇక బుచ్చిబాబు సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.

వీరమల్లు.. ఆ క్యారెక్టర్ అతి భయంకరంగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus