రామ్ చరణ్ నిర్ణయానికి ముంబై టీమ్ షాక్
- June 24, 2017 / 11:01 AM ISTByFilmy Focus
ధృవ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్నారు. సుకుమార్ డైరక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రీకరణలో బిజీగా ఉన్న రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయానికి ముంబై టీమ్ షాక్ తిన్నారంట. వివరాల్లోకి వెళితే.. జంజీర్ సినిమా నుంచి తన సినిమా ప్రచార వ్యవహారాలను చూసుకునేందుకు ముంబై చెందిన వారిని పీఆర్ టీమ్ లోకి తీసుకున్నారు. ధృవ వరకు వారు పనిచేశారు. వారిని విధుల నుంచి రీసెంట్ గా తొలిగించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
వారి వల్ల ఆశించిన స్థాయిలో తనకు ప్రయోజనం చేకూరలేదని తీసేశారని కొంతమంది అనుకుంటుంటే, వారికి పేమెంట్ లక్షల్లో ఉండటంతో పక్కన పెట్టారని మరికొంతమంది చెబుతున్నారు. కారణం ఏదైనా ఉన్నట్టుండి జాబ్ లోంచి తీసెయ్యడంతో ముంబై టీమ్ షాక్ తిన్నారంట. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న మూవీ సంక్రాంతికి రానుంది. అప్పటి లోపున చెర్రీ కొత్త పీఆర్ టీమ్ ని తీసుకోనున్నారు. ముంబై వారినే ఎంచుకుంటారా? ఇక్కడి వారిని తీసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పలేము.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















