Ram Charan: చరణ్‌ ఏదో అన్నాడు.. అది సినిమా అయిపోతోందా? నిజమిదే!

క్రికెటర్లుగా సినిమా హీరోలు నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చాలామంది హీరోలు క్రికెటర్లుగా నటించి అదరగొట్టారు కూడా. జీవిత కథల్లో నటిస్తే ఏదో తెలియని కిక్‌ ఉంటుంది అని కూడా చెబుతుంటారు. అలాగే పురస్కారాలకు కూడా అదొక దారి అని చెప్పొచ్చు. అలాంటి ఓ అవకాశం ఇప్పుడు రామ్‌చరణ్‌కు వస్తోందని సమాచారం. అది కూడా గతంలో ఓసారి చరణ్‌ చెప్పిన మాటకు తగ్గట్టే జరుగుతోంది. దీంతో ప్రస్తుతం పుకారుగా ఉన్న ఈ వార్త నిజమైతే బాగుండు అనుకుంటున్నారు.

స్టార్‌ క్రికెటర్, కింగ్‌ విరాట్‌ కోహ్లీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఎక్కడా ముందడగు వేసినట్లు కనిపించలేదు. అయితే హఠాత్తుగా ఇప్పుడు కోహ్లీ సినిమా విషయం చర్చల్లోకి వచ్చింది. అంతేకాదు ఆ పాత్రను రామ్‌ చరణ్‌కు ప్రపోజ్‌ చేశారు అని కూడా అంటున్నారు. బాలీవుడ్‌కి చెందిన ఓ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ ఈ మేరకు చరణ్‌ను కాంటాక్ట్‌ అయింది అనేద రూమర్‌. ప్రస్తుతం చర్చల దశలో ఈ ప్రాజెక్ట్‌ ఉంది అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో (Ram Charan) చరణ్‌ ప్రధాన పాత్రలో విరాట్‌ సినిమా అనౌన్స్‌ కావొచ్చు అని కూడా అంటున్నారు. గతంలో ఓసారి ఓ కాన్‌క్లేవ్‌కి వెళ్లినప్పుడు ఏ క్రికెటర్‌ పాత్రలో నటించడానికి ఇష్టపడతారు అని అడిగితే.. విరాట్‌ కోహ్లీలా నటించాలని ఉంది అన్నట్లు గుర్తు. ఇప్పుడు ఆ పాత్ర వెతుక్కుని మరీ దగ్గరకు వచ్చింది. మరి చరణ్‌ ఓకే చేస్తాడా లేదా అనేడి చూడాలి. ఒకవేళ ఓకే అయితే మాత్రం ఫ్యాన్స్‌కి పండగే.

అన్నట్లు గతంలో విరాట్‌ పాత్రను చేయడానికి తాను సిద్ధం అంటూ విజయ్‌ దేవరకొండ కూడా చెప్పాడు. విరాట్‌ బయోపిక్‌ను ఎవరైనా తీద్దాం అనుకుంటే ఆ పాత్రలో నటించడానికి సిద్ధం అంటూ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేశాడు. కాబట్టి అతను కూడా లైన్లో ఉన్నాడు. ఒకవేళ కోహ్లీ బయోపిక్‌ ఓకే అయితే… అనుష్క శర్మ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది మరో ఆసక్తికరమైన అంశం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus