Ram Charan, Upasana: పుట్టబోయే బిడ్డ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరికొన్ని నెలలలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన పది సంవత్సరాలు తర్వాత ఉపాసన తల్లి కాబోతున్నారన్న వార్త అభిమానులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి తరచూ తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వచ్చారు.

ఇకపోతే తాజాగా (Ram Charan) రామ్ చరణ్ సైతం తన పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా రాంచరణ్ కాశ్మీర్లో జరుగుతున్న జీ 20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తన పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జపాన్ పై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.

అంతేకాకుండా తనకు పుట్టబోయే బిడ్డకు జపాన్ కు సంబంధం ఉందని తెలియజేశారు. ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాజిక్ మొత్తం జపాన్ లోనే జరిగింది అందుకే తనకు జపాన్ అంటే ఇష్టమైన ప్రదేశమని జపాన్ కు తన మనసులో ఎప్పుడు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుందని తెలియజేశారు.

ప్రస్తుతం నా భార్యకు ఏడవ నెల అయితే ఈ మ్యాజిక్ మొత్తం జపాన్లోనే జరిగింది అంటూ ఈయన నవ్వుతూ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి తనకు పుట్టబోయే బిడ్డ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఉపాసన దంపతులు తమ ప్రేగ్నెన్సీ అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇంటర్వ్యూలో రాంచరణ్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus