మార్చి 12వ తేదీ జరగబోయే 95 వ ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ వేడుక కోసం భారతదేశ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా నిలవడంతో అందరిచూపు ఆస్కార్ వేడుకల పైన పడింది. ఇప్పటికే చిత్ర బృందం అమెరికా చేరుకొని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇలా ముగ్గురు వరుస ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ టాక్ ఈజీ పాడ్‌క్యాస్ట్‌లో హోస్ట్ సామ్ ఫ్రాగోసోతో మాట్లాడారు తన తండ్రి గురించి చెబుతూ ఎంతగానో మురిసిపోయాడు. తన తండ్రి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అయినప్పటికీ తన నీడలో మేము పెరుగకూడదని నాన్న ఎంతగానో కోరుకున్నారు. మాకంటూ సొంత గుర్తింపు ఉండాలని నాన్న తన స్టార్డం ఎప్పుడు తలకెక్కించుకోలేదు. తన స్టార్డం ఎప్పుడూ మా వరకు తీసుకురాలేదు.
ఇలా తన స్టార్డం మాపై ప్రభావం చూపకూడదని తండ్రి తనకు వచ్చినటువంటి అవార్డులను ప్రశంసా పత్రాలను ఇంట్లో అస్సలు పెట్టలేదని వాటన్నింటిని కూడా తన ఆఫీసులో పెట్టుకున్నారని చరణ్ తెలిపారు.ఆ అవార్డు చూసి మేము ఆయన ఒక గొప్ప స్టార్ అని ఫీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నాన్న తన అవార్డులను ఇంట్లో పెట్టలేదని చరణ్ తెలిపారు. మమ్మల్ని ఒక స్టార్ కిడ్స్‌గా కాకుండా సాధారణ పిల్లలుగానే పెంచాడు. ఇండస్ట్రీలో పెద్ద హీరో అని చెప్పడానికి నాన్న ఎప్పుడు ఇష్టపడలేదని చరణ్ తెలిపారు.
ఇక నాన్న సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అని ఆయన ద్వారా మేము ఇండస్ట్రీలోకి ఈజీగా అడుగు పెట్టవచ్చని ఎప్పుడు అనుకోలేదు నాన్న అలా పెంచలేదని తెలిపారు. అయితే ఆయన చేసినదంతా కూడా మా కోసమేనని ఆయన అలా పెంచడం వల్ల నేడు మేము ఈ స్థాయిలో ఉన్నామని చరణ్ తెలిపారు. నాన్న ఈ పెంపకం కారణంగానే ఇప్పటికీ నా ఈఎమ్‌ఐలు నేను కట్టుకోగలుగుతున్నాను అంటే అది కేవలం నాన్న వళ్ళ మాత్రమే అంటూ ఈ సందర్భంగా చరణ్ తండ్రి గురించి ఎంతో గొప్పగా చెబుతూ మురిసిపోయారు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్