టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదగడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు చరణ్ కు క్రేజ్ పెరుగుతుండగా చరణ్ సినిమాలలో చాలా సినిమాలు ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. రామ్ చరణ్ రేంజ్, పారితోషికం రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన రంగస్థలం 8.2 ఐఎండీబీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.
రామ్ చరణ్ సినీ కెరీర్ లో హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 7.9 కావడం గమనార్హం. మగధీర సినిమా ఐఎండీబీ రేటింగ్ 7.7 కాగా ధృవ సినిమా ఐఎండీబీ రేటింగ్ 7.7గా ఉంది. ఆరెంజ్ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయినా ఈ సినిమాకు 6.6 రేటింగ్ వచ్చింది. ఎవడు సినిమా రేటింగ్ 5.8 కాగా గోవిందుడు అందరివాడేలే 5.7, నాయక్ 5.6 రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి.
చరణ్ నటించిన ఇతర సినిమాలు మాత్రం మంచి రేటింగ్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ మరింత స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.
రామ్ చరణ్(Ram Charan) రేంజ్ మరింత పెరుగుతుండగా వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్నారు. చరణ్ నర్తన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?