మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చరణ్ నుండి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ డిజప్పాయింట్ చేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత 3 ఏళ్ళు కష్టపడి చేసిన ‘గేమ్ ఛేంజర్’ నిరాశపరచడం అనేది చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. చరణ్ ప్రైమ్ టైంలో దాదాపు 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది అని అభిమానులు బాధపడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వాటిని ‘పెద్ది’ మరిపిస్తుంది అని అంతా నమ్ముతున్నారు.
ఇక ‘పెద్ది’ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. ఇటీవల వచ్చిన గ్లింప్స్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం రాంచరణ్ చాలా కష్టపడుతున్నాడు. ‘పెద్ది’ లో తన పాత్ర కోసం స్పెషల్ గా ట్రైనర్ ను పెట్టుకుని మరీ జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. ఈరోజు ట్రైనింగ్ సెషన్ నుండి ఓ ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు చరణ్.
“చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది బిగిన్..” అనే క్యాప్షన్ తో చరణ్ ఈ ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో చరణ్ కండలు తిరిగిన దేహం, గుబురు గడ్డంతో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని డెడికేషన్ కు కొంత మంది నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అయితే చూడటానికి ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ లా ఉన్నాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.