వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్న చెర్రీ!!!
- November 14, 2016 / 07:55 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గొప్పతనం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పక తప్పదు. ఆ కుటుంభం నుంచి వచ్చిన హీరోలు అందరూ దాదాపుగా సక్సెస్ అయినట్లే అన్న రిసల్ట్ మనం ఇప్పటికీ ఇండస్ట్రీలో చూస్తున్నాం…ఇదిలా ఉంటే ఈ మెగా హీరోలు అందరికీ గాడ్ ఫాధర్ మన మెగాస్టార్ చిరంజీవి అనడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు…అయితే మెగాస్టార్ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా తనయుడు రామ్‌చరణ్ తేజ మగధీర సినిమాతో టాలీవుడ్ రికార్డుల చరిత్రను తిరగ రాసిన సంగతి తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ సినిమాను మినహాయిస్తే ఆతరువాత సినిమాలు పెద్దగా చెర్రీ గ్రాఫ్ ని పెంచ లేకపోయాయి అన్న వాదన టాలీవుడ్ లోనే కాదు….అభిమానుల్లో కూడా ఉంది.
అంతేకాదు…చిరు లా ప్రేక్షకులను మెస్‌మర్రైస్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నా ఏదో తెలియని లోటు చెర్రీలో కనిపిస్తూ ఉండడంతో ఇప్పుడు ఆ లోటును పూడ్చె పనిలో పడ్డాడు చెర్రీ…ఇంతకీ చెర్రీ ఏం చేస్తున్నాడు అంటే….తన పిఆర్ టీమ్ కు సినిమా హిట్స్ తో సంబంధం లేకుండా తన ఇమేజ్ ని పెంచే ఆలోచనలు చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడట….కధలు, సినిమాలే కాకుండా…వ్యక్తిగతంగా కూడా తనను తాను ఆవిష్కరించుకోవాలి అని అనుకుంటున్న చెర్రీ…తరుచు మెగా అభిమానులను వ్యక్తిగతంగా కొలుస్తూ వారి సలహాలు వినడంతో పాటు ఇంకా ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ అందరికీ దగ్గర అవుతూ అందరి వాడిగా మారాలని భార్యతో కలసి పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూద్దాం మరి చెర్రీ ఈ ఆలోచనలో ఎంతవరకూ సక్సెస్ కాగలడొ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















