Ram Charan: క్లీంకార – చిరంజీవి అనుబంధం గురించి చెప్పిన చరణ్‌… ఏమన్నాడంటే?

చిరంజీవిలో (Chiranjeevi) ఓ చిన్నపిల్లాడు ఉంటాడని, ఎవరైనా పిల్లలు ఆయన దగ్గరికి వస్తే ఆ పిల్లాడు బయటకు వచ్చి వాళ్లతో కలసి ఎంజాయ్‌ చేస్తాడని అంటుంటారు. సినిమా సెట్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌లతో సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటాడట. అలాంటి చిరంజీవి తన మనవళ్లు, మనవరాళ్లతో ఎలా ఉంటాడు? ఇంకా డబుల్‌ ఎంజాయ్‌ చేస్తాడు అని చెప్పొచ్చు. మెగా మనవరాలు క్లీంకార గురించి చెబుతూ రామ్‌చరణ్‌ (Ram Charan) ఇటీవల చిరంజీవి గురించి కూడా మాట్లాడాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

చిరంజీవి ఇంట మనవరాళ్లు కొత్తేం కాదు. కుమార్తెల కుమార్తెలు ఇప్పటికే మనవరాళ్ల రూపంలో ఉన్నారు. అయితే రామ్ చరణ్ కుమార్తె ఆయనకు మరింత స్పెషల్ అని చెప్పొచ్చు. మరి చిరంజీవి – క్లీంకారా మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుంది అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ‘క్లీంకారాతో చిరంజీవి సందడి మరో లెవల్‌లో ఉంటుంది’ అంటూ రామ్‌చరణ్‌ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. క్లీంకారాతో ఉన్నప్పుడు చిరంజీవి తాతలా కాకుండా.. ఓ చిన్నపిల్లాడిలా అయిపోతారు అని రామ్‌చరణ్‌ చెప్పాడు.

క్లీంకారాతో ఆటలు ఆడుతూ, ఆడిస్తూ మురిసిపోతుంటారట చిరు. అంతేకాదు తనను తాత అని పిలవొద్దని, ఇంట్లో మనవరాళ్లు అలా పిలిచి పిలిచీ బోర్ కొట్టేసిందని చిరు అంటుంటారట. అందుకే తనను ‘చిరుత’ అని పిలవమని క్లీంకారకు చెబుతుంటారట. చిరుతాత కాకుండా.. ‘త’ తీసేసి చిరుతా అనే పిలపుతో మనవరాలితో పిలిపించుకోవాలనేది చిరంజీవి ఆలోచన. ఇదే మాట గతంలో ఓసారి చిరంజీవి చెప్పాడు.

యువ దర్శకులతో ఓ సినిమా సమయంలో ప్రమోషన్‌ ఈవెంట్‌ చేసినప్పుడు ఈ మాటలు అన్నారు చిరు. ఇప్పుడు ఆ సినిమా పేరు చెప్పడం అప్రస్తుతం, సరికాదు కూడా. ఎందుకంటే ఆ సినిమా పేరెత్తితే ఫ్యాన్స్‌ హర్టవుతారు కూడా. ఎలాగూ సినిమాల ముచ్చట వచ్చింది కాబట్టి. చిరంజీవి ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారో చూద్దాం. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) దర్శకత్వంలో చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus