Ram Charan: చరణ్ ను ఆ మూవీ రిజల్ట్ భయపెట్టిందా?
- September 18, 2021 / 01:08 PM ISTByFilmy Focus
స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమా కొంతమంది ప్రేక్షకులకు నచ్చినా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. ఆరెంజ్ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదని చరణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నాగబాబుకు నిర్మాతగా ఆరెంజ్ సినిమా భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ నటించిన ప్యూర్ లవ్ స్టోరీ కావడం గమనార్హం. అయితే ఈ సినిమా రిజల్ట్ చరణ్ కు సైతం షాక్ ఇచ్చింది.
ఆ తరువాత చరణ్ మాస్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. చరణ్ మళ్లీ ప్యూర్ లవ్ స్టోరీలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ ఇమేజ్ కు భిన్నంగా రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ రాబోయే రోజుల్లో ప్యూర్ లవ్ స్టోరీతో ఉన్న కథలను ఎంచుకుంటారేమో చూడాల్సి ఉంది. అయితే ఆరెంజ్ రిజల్ట్ చరణ్ ను భయపెట్టిందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలను పూర్తి చేసి శంకర్ సినిమా షూటింగ్ లో త్వరలో పాల్గొనాలని భావిస్తున్నారు.

చరణ్ శంకర్ సినిమాకు ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కాగా ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించాలని ఈ సినిమా నిర్మాత భావిస్తున్నట్టు తెలుస్తోంది. చరణ్ కు జోడీగా కియారా నటిస్తుండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. శంకర్ ఒకే ఒక్కడు, శివాజీ తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

















