Ram Charan: నాన్న నన్ను తిట్టడంతో ఉపాసన షాక్ అయింది… అసలు విషయం చెప్పిన చరణ్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRRసినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా వరుసగా అవార్డులు కూడా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం విశేషం.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ మీడియాతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామ్ చరణ్ తన తండ్రి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.తన తండ్రి చిరంజీవి గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారని అయితే ఆయన ఒక హీరోగా బాడీ ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చరణ్ తెలిపారు. ఒకరోజు అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు ఏంట్రా ఈ మధ్య కాస్త బరువు తగ్గావనీ అడిగారు అయితే నేను నిజమేననుకొని అవును నాన్న అనడంతో ఇడియట్ నేను ఏదో సరదాగా అన్నాను ఇప్పటికే చాలా బరువు పెరిగిపోయావు..

బాడీ ఫిజిక్ గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా జిమ్ముకు వెళ్ళు అంటు తనకి వార్నింగ్ ఇచ్చారు.ఈ విధంగా ఉపాసన ముందు తిట్టడంతో ఉపాసన ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అలా తిట్టారని అడిగేసిందని చరణ్ తెలిపారు. అది నాన్న నన్ను తిట్టడం కాదు ఇద్దరు నటల మధ్య జరిగే సంభాషణ అంటూ తాను ఉపాసనకు చెప్పానని చరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు నటన అంటే చాలా ఇష్టం కానీ నాన్న మాత్రం బలవంతంగా తనను చదువుకోవడానికి పంపించేవారు.

ముందు చదువు పూర్తి చేసిన తర్వాతే ఇష్టం వచ్చినది చేయమని చెప్పేవారు.నాకు చదువు ఇష్టం లేకపోవడంతో మా డీన్ డాడ్ కి ఫోన్ చేసి మీ అబ్బాయికి నచ్చినది చేపించండి అని చెప్పడంతో కాలేజ్ నుంచి నేను యాక్టింగ్ స్కూల్ కి షిఫ్ట్ అయ్యానని ఈ సందర్భంగా తెలిపారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus