Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ లో చరణ్ పాత్రకి ఆ సమస్య ఉంటుందా?

సినిమాలో హీరోకి లోపం ఉండటం అనేది కొత్త విషయం కాదు. ఈ మధ్య అది హిట్టు ఫార్ములాగా కూడా మారిపోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లేకి ఈ లోపం అనేది కూడా ఉపయోగపడాలి. ఈ సమస్య వల్ల స్క్రీన్ ప్లే ఎలా మారుతుంది అనేది మెయిన్ పాయింట్. కానీ హైప్ కోసం ఏదో ఒక లోపం ఉన్నట్టు చూపిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ మధ్య కాలంలో ‘గుంటూరు కారం’ సినిమా కనుక చూస్తే .. అందులో మహేష్ బాబు పాత్రకి ఒక కన్ను కనపడదని..

అది అతని లోపం అన్నట్టు చూపించారు. కానీ ఆ లోపం సినిమా కథని మలుపు తిప్పేలా ఏమీ ఉండదు. అసలు అవసరమే లేదు. అన్నీ ఎలా ఉన్నా.. దర్శకుడి తెలివితేటలపై కూడా డౌట్ వచ్చేలా చేస్తుంది. అయితే ‘రంగస్థలం’ లో (Rangasthalam)  సుకుమార్ (Sukumar) ఎంత తెలివిగా ఆ లోపాన్ని వాడుకున్నాడు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. రాంచరణ్ (Ram Charan)  ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమా చేస్తున్నాడు.

ఇందులో అతనిది డబుల్ రోల్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రకి ఈ సమస్య ఉంటుందట. ఈ సమస్య వల్ల కథలో చాలా మార్పులు వస్తాయట. అది ఎలా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. గతంలో చూసుకుంటే ‘ఉప్పెన’ లో (Uppena) వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) , ‘ఎఫ్ 3’ లో (F3 ) వరుణ్ తేజ్ (Varun Tej).. వంటి మెగా హీరోలు నత్తి అనే సమస్య ఉన్న పాత్రలో నటించారు. ఇప్పుడు చరణ్ కూడా ఆ లిస్ట్ లో చేరినట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus