Ram Charan: ‘ఇండియన్ 2’ లో రామ్ చరణ్ పాత్ర అలా ఉండబోతుందా..?

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, అలాగే కమలహాసన్ తో ఇండియన్ 2 చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా గేమ్ గెహెనార్ సినిమాని వేగంగా చేస్తూ వచ్చిన శంకర్ కి మధ్యలో ఇండియన్ 2 కూడా చెయ్యాల్సి వచ్చింది. ఒక నెలలో ఇండియన్ 2 షూటింగ్ ని 15 రోజులు చేస్తే, మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ చేసేవాడు.

ఇండియన్ 2 మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గానే 10 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేసారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో రెండు వారాల నాన్ స్టాప్ షెడ్యూల్ జరగబోతుంది. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యినట్టే. ఇదంతా పక్కన పెడితే శంకర్ కూడా సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈమధ్య లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలుసు. శంకర్ కూడా అలా ప్లాన్ చేస్తున్నాడు అట. ఇండియన్ 2 క్లైమాక్స్ లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేసాడట. ఈ రోల్ గేమ్ చేంజర్ లోని రామ్ చరణ్ పోషించిన IAS పాత్ర అని తెలుస్తుంది. అలా గేమ్ చేంజర్ పాత్ర ని ఇండియన్ 2 ద్వారా పరిచయం చెయ్యబోతున్నాడు అట శంకర్.

ఇక ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీ కి కొనసాగింపుగా ‘ఇండియన్ 3 ‘ కూడా చేస్తాడట. ఇదే కనుక నిజమైతే ఈ మూడు సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. ఇలా రాబొయ్యే రోజులు మొత్తం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ తో కళకళలాడబోతుంది అని చెప్పొచ్చు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus