Ram Charan, Shankar: శంకర్ మూవీలో చరణ్ అలా కనిపించరా?

చరణ్ శంకర్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. 2023 సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించి సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. చరణ్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారని తండ్రిగా, ఇద్దరు కొడుకుల పాత్రల్లో కనిపిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. శంకర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ మాత్రమే పోషిస్తున్నారని బోగట్టా. ఒక పాత్రలో సివిల్ సర్వంట్ గా చరణ్ కనిపిస్తారని మరో రోల్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. చరణ్ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. చరణ్ సైతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమా షూటింగ్ లో పాల్గొనరని తెలుస్తోంది.

ఈ సినిమాతో చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాసినిమాకు చరణ్ రేంజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. చరణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటే చరణ్ తర్వాత సినిమాలకు రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

సినిమాల ఎంపిక విషయంలో చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చరణ్ తర్వాత సినిమా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus