‘జెస్సీ’కి చెర్రీ నో చెప్పాడట!!!
- December 19, 2016 / 06:02 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో ఒకరు టాప్ హీరోయిన్, మరొకరు టాప్ హీరో కొడుకు…అదే క్రమంలో టాప్ హీరోల్లో ఒకరు…అయితే వీళ్ళిద్దరూ కలసి ఒక సినిమా చెయ్యాల్సి ఉంది..కానీ, ఆ హీరో ఆ హీరోయిన్ కు నో చెప్పడంతో వాళ్ళిద్దరూ కలసి ఆ సినిమా నటిస్తే చూసే అవకాశాన్ని కోల్పోయారు మన టాలీవుడ్ అభిమానులు…ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ కలసి ఒక సినిమాలో నటించాల్సి ఉంది….అయితే అందుకు చెర్రీ ఒప్పుకోలేదని సమాచారం..ఇంతకీ ఏ సినిమా ఏమా కధ అంటే…వరుస పరాజయాల తరువాత వచ్చిన ‘ధృవ’ చిత్రం చరణ్ కి మంచి జోష్ ని ఇచ్చింది.
ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీకి రెడీ అవుతున్నారు. సుకుమార్ డైరెక్షన్లో చరణ్ కొత్త సినిమాని మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కి సంబంధించిన సెలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై ఇప్పటికే హాట్ టాక్స్ నడుస్తున్నాయి. అయితే హీరోయిన్ గా సమంతని తీసుకోవాలని సుకుమార్ సజెస్ట్ చేయగా చెర్రీ మాత్రం సమంత ఆప్షన్ కి నో చెప్పినట్లు సమాచారం.
అంతేకాకుండా కొత్త హీరోయిన్ ను తీసుకుందామని సుకుమార్ కి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి…అంతేకాదు…ఈ వేరే వేటలో భాగంగా ‘ప్రేమమ్’ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశాడట సుకుమార్. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో అనుపమ ‘ప్రేమమ్’కి మంచి పేరు వచ్చింది. ఈ బ్యూటీ తెలుగు లో త్రివిక్రమ్ ‘అ..ఆ’ లో నటించి మెప్పించింది. టాలీవుడ్ నుంచి విపిస్తున్న వివరాల ప్రకారం ఏ భామ చెర్రీ సినిమాలో దాదాపుగా ఒకే అయినట్లే అని తెలుస్తుంది…మరి ఏ భామ ఈ సినిమాకి ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















