Ram Charan: చిన్నారిని చూసి చలించిపోయిన రామ్ చరణ్ ఏం చేశాడంటే..!

అభిమానానికి వయసుతో సంబంధం ఉండదు.. ఊహ తెలియని వయసులో కూడా స్క్రీన్ మీద కనిపించే ఒక నటుడు, నటిని చూసి ఇష్టపడడం అంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి.. చిన్నారులు కూడా ఫేవరెట్ హీరో, హీరోయిన్స్ డైలాగ్స్ చెప్పడం, డ్యాన్సులెయ్యడం లాంటి వీడియోలు భలే ముద్దుగా ఉంటాయి.. అలాంటి అభిమానులను చూస్తే సెలబ్రిటీలకు కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది..

సాధారణంగా యూత్.. తమ అభిమాన నటీనటులతో సెల్ఫీ కోసం, కలిసి మాట్లాడడం కోసం ఆరాట పడుతుంటారు.. కానీ ఓ చిన్నారి మాత్రం తన సూపర్ హీరోతో ఫోటో కోసం కంటతడి పెట్టేసింది.. ఈ దృశ్యం చుట్టూ ఉన్నవారికి షాక్, ఆశ్చర్యం లాంటివి కలిగిస్తే.. ఆ చిన్నారి కన్నీరు ఏకంగా తన అభిమాన హీరో చలించిపోయేలా చేసింది..

వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు రోజుల ముందుగానే అమెరికా వెళ్లారు.. న్యూయార్క్‌లో వరల్డ్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లో పార్టిసిపెట్ చేశారు.. ఈ షోలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ చరణే కావడం విశేషం.. ఈ విషయం తెలుసుకుని చరణ్‌ని చూడ్డానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు వచ్చారు.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చరణ సైతం సర్‌ప్రైజ్ అయ్యారు..

ప్రోగ్రాం అనంతరం చరణ్ బయటికి రాగానే.. జనాలంతా సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్‌ కోసం ఎగబడ్డారు.. వారిని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా తంటాలు పడ్డారు.. అయితే చరణ్‌ని కలిసి సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ చిన్నారి.. అక్కడే వెక్కి వెక్కి ఏడ్చేసింది.. అప్పటికే వెళ్లిపోదామని కారు దగ్గరికి వెళ్లిన చరణ్.. చిన్నారి ఏడుపు చూసి చలించిపోయారు.. వెంటనే ఏడుస్తున్న చిన్నారి వద్దకు వచ్చి.. షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus