RC15: రామ్ చరణ్, శంకర్.. టైటిల్ ఇదేనా?

రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న మొట్ట మొదటి సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దర్శకుడు శంకర్ మొదటిసారి ఒక తెలుగు హీరోతో సినిమా చేస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకుల్లో నే కాకుండా తమిళ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే అలాగే హీరో శ్రీకాంత్ తో పాటు సునీల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు

Click Here To Watch Now

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మొదట ప్రభుత్వాన్ని ఎదిరించే పాత్రలో ఒక కామన్ మ్యాన్ గా కనిపిస్తాడట. ఆ తరువాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించే రామ్ చరణ్ అనంతరం పూర్తిగా ఒక రాజకీయ నాయకుడిగా మారతాడు అని తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో దర్శకుడు శంకర్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఆ టైటిల్ సినిమా కథకు అయితే కెరక్టుగా సరిపోతుందిని కూడా ఆలోచిస్తున్నారు. మరో రెండు టైటిల్స్ పై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వాటిలో ఎదో ఒక టైటిల్ పై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇక వీలైనంత త్వరగా మరో లుక్ తో పాటు టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన టైటిల్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక శంకర్ ఈ సినిమాల్ రామ్ చరణ్ మూడు రకాల షేడ్స్ లో చూపించబోతున్నట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. సినిమాకు పెట్టిన పెట్టుబడిలో లాభం వచ్చే విధంగా ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు టాక్.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus