మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. అక్కడ గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ పాత్ర ముఖ్యమంత్రిగా కనిపించనుంది. ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ కి ఓటు వేయాలని జనాలను రిక్వెస్ట్ చేసే సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 25వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఒక పాత్ర ముఖ్యమంత్రి అయితే మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపిస్తారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కొత్త ఏడాదిలోనే ఉంటాయని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. శంకర్ సినిమాతో మరో హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్ లాంటి తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!