ఒకే కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ పోటీ కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. 2016 సంవత్సరంలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా డిక్టేటర్ సినిమాకు యావరేజ్ టాక్ వస్తే నాన్నకు ప్రేమతో సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అప్పుడు బాలయ్య తారక్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం హాట్ టాపిక్ అయింది. అయితే అదే సీన్ 2024లో రిపీట్ కానుంది. 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా పవన్ చరణ్ సినిమాలు పోటీ పడనున్నాయి.
పవన్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కన్న ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని హరీష్ శంకర్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. చరణ్ శంకర్ కాంబో మూవీ కూడా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. బాబాయ్ అబ్బాయ్ పోటీపై చరణ్ ఏమంటారో చూడాల్సి ఉంది. చరణ్ శంకర్ కాంబో మూవీ బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు కాగా పండుగకు రిలీజ్ చేస్తే మాత్రమే ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
మరోవైపు పుష్ప2 మూవీ టార్గెట్ కూడా సంక్రాంతి అని తెలుస్తోంది. మెగా హీరోల సినిమాలు ఒక సినిమాతో మరొకటి పోటీ పడితే ఏదో ఒక సినిమా నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాకు సంబంధించి అప్ డేట్ రావాల్సి ఉంది. చరణ్ తో ఉప్పెనను మించిన సినిమాను తెరకెక్కించడంతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చరణ్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను కచ్చితంగా షేక్ చేస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?