రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎప్పుడు రెగ్యులర్ ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. కాస్ట్ అండ్ క్రూను ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారు టీమ్. ఈ క్రమంలో సినిమా కథ గురించి ఓ ఆసక్తికర పుకారు టాలీవుడ్ వర్గాల్లో షికార్లు కొడుతోంది. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమా ఉత్తరాంధ్రకే బాహుబలి అని చెప్పగలిగే ఓ మహోన్నత వ్యక్తి కథ అంటున్నారు.
ఒకప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసి… ఆ తర్వాత నెమ్మదిగా ఉత్తరాది ప్రాంతానికి మాత్రమే పరిచయం ఉన్న అలనాటి కండల వీరుడు కోడి రామ్మూర్తి జీవితం ఆధారంగా రామ్‌చరణ్ సినిమా చేస్తున్నారు అని అంటున్నారు. అదేంటి ఒకప్పుడు అందరికీ తెలియడం, ఇప్పుడు లేకపోవడం అంటున్నారా? ప్రాంతాలపరంగా వెనుకబడినట్లే చరిత్రలోనూ, అందులోనూ కోడి రామ్మూర్తి లాంటి కండరగండడు జీవితం నేటి తరానికి అందించడంలో వెనుకబడ్డాం లెండి.
ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా కోడి రామ్మూర్తి కథ అంటున్నారు. ఆ నాటి రోజుల్లో మల్లయుద్ధంలో కోడి రామ్మూర్తిని మించిన వారు లేరు అని అంటుంటారు. శ్రీకాకుళానికి చెందిన ఆయనను అప్పుడు ఇండియన్ హెర్క్యులస్ అని పిలిచేవారు. అప్పట్లో ఆయన ప్రపంచ ప్రేక్షకులు, మల్లయుద్ధ ప్రియులు నివ్వెరపోయేలా విన్యాసాలు చేశారట. అలాంటి లెజెండరీ పర్సనాలిటీ పాత్రలో (Ram Charan) చరణ్ ఇప్పుడు నటిస్తున్నాడు అంటున్నారు.
ఈ సినిమా తొలుత విలేజ్ నేపథ్యంలో కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఇలా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విషయంలో క్లారిటీ అవసరం ఉంది. ప్రస్తుతం కాస్టింగ్ విషయంలో ఉత్తరాంధ్ర వాసన బలంగా వచ్చేలా టీమ్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. దీనికి మంచి స్పందన కూడా వస్తోందట. సినిమా మొదలైతే ఈ పుకార్ల విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!