Ram Charan: మాలలో ఉండగా దర్గాకి వెళ్ళిన రాంచరణ్.. కారణం..!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయ్న క‌డ‌ప ద‌ర్గాను సందర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. క‌డ‌ప ద‌ర్గాలో 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ వేడుకలు జరిగాయి. ఇక్కడికి గతంలో చాలా మంది సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే.ఆస్కార్ అవార్డు గ్రహీత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఎ.ఆర్‌.రెహ్మాన్‌ (A.R.Rahman), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వంటి వారు కూడా ఈ దర్గాను సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఏ.ఆర్.రెహమాన్ అయితే ప్రతి ఏడాది ఈ దర్గాకి వెళ్తుంటారు.

Ram Charan

ఇక 2024 కి గాను ఈ దర్గాలో 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకి రాంచరణ్ ని తీసుకొస్తానని రెహమాన్ చెప్పారట. ఇదే మాట ఆయన చరణ్ కి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే చరణ్ గురించి ఆయన దర్గా యాజమాన్యానికి ప్రత్యేకంగా చెప్పి ఉండొచ్చు. అయితే ప్రస్తుతం రాంచరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు.

మరి దీక్షలో ఉండగా ఇలా దర్గాకు వెళ్లడం కరెక్టేనా? అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చాలా చోట్ల దీనిపై చర్చలు కూడా గట్టిగా జరుగుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి తప్పు లేదు అనేది కొందరి వాదన. ‘ఇందు గలడు అందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలడు’ అంటూ ప్రహ్లాదుడు పలికిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఇక రాంచరణ్ మాట్లాడుతూ.. ‘‘కడప దర్గాతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ ద‌ర్గా రుణం తీర్చుకోలేనిది. గతంలో నా ‘మ‌గ‌ధీర’ (Magadheera) సినిమాకి ముందు రోజు నేను ఈ ద‌ర్గాను సంద‌ర్శించుకున్నాను.

ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయ్యి నాకు స్టార్ డం తెచ్చిపెట్టింది. ఇక ఎ.ఆర్‌.రెహ్మాన్‌గారు ఈ ద‌ర్గాలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి నన్ను హాజ‌రు కావాల్సిందిగా 3 నెల‌ల క్రితమే నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వ‌స్తాన‌ని ఆయ‌న‌కి మాట ఇచ్చాను.మాల‌లో ఉన్నాను అని తెలుసు. కానీ ఆయనకి ఇచ్చిన మాట కోసం నేను ఈ ద‌ర్గాకు రావడం జరిగింది. ఇక్క‌డ‌కి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus