మెగా ఫ్యాన్స్‌కి నిన్నే ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమాను మే 9న విడుదల చేస్తాం అని టీమ్ ప్రకటించింది. అందులోనూ సినిమాను నవీకరించి, త్రీడీలో తీసుకొస్తామని చెప్పి డబుల్ హ్యాపీనెస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి యాడ్ అయింది. అయితే ఈసారి గుడ్ న్యూస్ రామ్‌చరణ్ (Ram Charan) వైపు నుండి వచ్చింది. ఆ లెక్కన మే9న మెగా ఫ్యాన్స్ ట్రిపుల్ ధమాకా రానుంది. ఇది కూడా కొన్ని రోజుల నుండి మెగా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే.
ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియంలో సెలబ్రిటీలు, ప్రముఖుల విగ్రహాలను పెడుతుంటారు. మైనం చేసిన ఆ విగ్రహాలను ఓ ఘనతగా చెబుతుంటారు. అలా రామ్‌చరణ్ మైనపు విగ్రహం కూడా టుస్సాడ్స్‌లో రెడీ అవుతోంది. కొన్ని నెలల క్రితం ఈ మేరకు చరణ్ కొలతలను తీసుకున్నారు. దాంతోపాటు అతని పెంపుడు శునకం రైమ్ కొలతలు తీసుకున్నారు. ఇప్పుడు విగ్రహం సిద్ధమైందట. దానిని మే 9న ఆవిష్కరించనున్నారట. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో లాంచ్ చేస్తారు.
లాంచ్ అయిన తర్వాత విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. అక్కడే ఆ విగ్రహం ఉండబోతోంది. ఇప్పటికే మన దేఅఆనికి చెందిన ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలను టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుండి మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ విగ్రహాలు ఉన్నాయి. మహేష్ నార్మల్ లుక్‌లో ఉండగా.. అల్లు అర్జున్ ‘పుష్ప’ (Pushpa) పోజులో ఉంటాడు. ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి’ (Baahubali) లుక్‌లో ఉంటాడు. మరి చరణ్ ఎలా ఉంటాడో చూడాలి.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) సినిమాలో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయాలని టీమ్ చూస్తోంది. ఈ మేరకు ఇటీవల రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు కూడా.