Ram Charan: బాలీవుడ్ డిజాస్టర్ స్టార్ తో రామ్ చరణ్.. ఫ్యాన్స్ లో కంగారు!

ఇటీవల బాలీవుడ్‌లో ఒక హారర్ కామెడీ చిత్రం సెట్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రియదర్శన్ (priyadarshan) దర్శకత్వంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla) సినిమా రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే సమయంలో అక్క‌డే రామ్ చరణ్ కనిపించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ప్రియదర్శన్, మరో ఇద్ద‌రు సభ్యులతో కలిసి ఉన్న ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అయింది. దీంతో మెగా అభిమానులలో ఎలాంటి ప్రాజెక్ట్‌లో చరణ్ భాగమవుతాడా అనే ఉత్కంఠ మొదలైంది.

Ram Charan

అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో కష్టాల్లో ఉన్నారు. ఇటీవల అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయిలో కూడా నిలబడలేకపోయాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పేరు అటాచ్ కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. “ఇప్పుడు అక్షయ్ సినిమాలే నష్టాల్లో ఉన్నాయి.. చరణ్ ఎందుకు అలా రిస్క్ చేస్తున్నాడు?” అనే టెన్షన్ కామెంట్లు వెలువడుతున్నాయి.

అయితే, మరో కోణంలో చూస్తే ఇది కేవలం నార్మల్ విజిట్ కావచ్చని తెలుస్తోంది. బహుశా చరణ్ (Ram Charan) అక్కడ దగ్గరలో షూటింగ్‌లో ఉండి ఉండవచ్చు, లేదా ప్రియదర్శన్‌కి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కలిసి ఉండొచ్చు. ప్రియదర్శన్ గతంలో సౌత్ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించడమే కాక, తెలుగు నటులతోనూ మంచి రిలేషన్‌లో ఉంటారు. ఇక చరణ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, బుచ్చిబాబు సానాతో (Buchi Babu Sana) ‘RC16’, సుకుమార్‌తో (Sukumar)   ‘RC17’, ఇక రూమర్స్ ప్రకారం లోకేష్ కనగరాజ్‌తో (Lokesh Kanagaraj) ‘RC18’ లైనప్‌లో ఉన్నాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో బాలీవుడ్ గెస్ట్ అప్పీరెన్స్ చేయడం లాంటివి జరగొచ్చని టాక్. మొత్తానికి ఈ ఫొటో పై ఇప్పట్లో అధికారికంగా ఏ సమాచారం లేకపోయినా.. చరణ్ బాలీవుడ్ ఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. ఇది స్పెషల్ కెమియో అయితే సరే కానీ, మల్టీస్టారర్‌గా డిజాస్టర్ హీరోతో చేయడం మెగా ఫ్యాన్స్ కి అస్సలు ఇష్టం ఉండదనే విషయం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus