కథానాయకుడిగా కంటే నటించే ప్రతి సినిమాతో వ్యక్తిగా ఎదుగుతున్న రామ్ చరణ్ ఇటీవల తన సినిమాల సెలక్షన్ విషయంలో విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటున్న విషయం తెలిసిందే. అలాగే.. వ్యక్తిగానూ రామ్ చరణ్ “మేము సైతం” ప్రోగ్రామ్ ద్వారా తన ధాతృత్వాన్ని చాటుకొన్నాడు. అలాగే.. మొన్నామధ్య ఓ ప్రెస్ మీట్ లో కలెక్షన్స్ గురించి, రికార్డ్స్ గురించి జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకొని ఇకపై తన సినిమాల్లో తన సినిమా పోస్టర్స్ మీద నెంబర్ల లెక్కలు ఉండబోవని హామీ ఇచ్చాడు రామ్ చరణ్.
అలాగే.. బాబాయ్ పిలవాలే కానీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేందుకు కూడా తాను సిద్ధమని తెలిపాడు రామ్ చరణ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ పిలవాలే కానీ తాను “జనసేన” తరపున ప్రచారం చేయడానికి సిద్ధమని సంకేతమిచ్చాడు. తన కుటుంబసభ్యులెవరూ తన కోసం రాజేకీయాల్లోకి రావడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ తన ముద్దుల తమ్ముడు లాంటి రామ్ చరణ్ ను ప్రచారం కోసం పిలుస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. చరణ్ స్వయంగా ముందుకురావడం అనేది మెగా అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది.
ఒకపక్క బోయపాటి సినిమాలో మాస్ రోల్ ప్లే చేస్తూనే.. ఇమ్మీడియట్ గా రాజమౌళి చిత్రంలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం చరణ్ ను అందరికీ దగ్గర చేస్తుంది. సొ, చరణ్ కథానాయకుడిగా, వ్యక్తిగా రానున్న కాలంలో అగ్ర కథానాయకుడిగా అలరారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.