Klin Kaara Birthday: క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఉపాసన ఎమోషనల్ వీడియో వైరల్!

  • June 20, 2024 / 03:49 PM IST

రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసనల గారాలపట్టి క్లీంకార ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. క్లీంకార తొలి పుట్టినరోజు కావడంతో ఈరోజు అభిమానులకు సైతం స్పెషల్ రోజుగా నిలిచింది. ఉపాసన క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నా ప్రియమైన క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఉపాసన పేర్కొన్నారు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయని మా లైఫ్ లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు అని ఉపాసన ఆ వీడియోలో పేర్కొన్నారు.

క్లీంకార పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయని తెలుస్తోంది. సినీ ప్రముఖులు సైతం క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) “లిటిల్ వండర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని కామెంట్ చేయగా “హ్యాపీ బర్త్ డే లిటిల్ స్టార్” అంటూ క్లీంకారకు రకుల్ (Rakul Preet Singh) , కియారా (Kiara Advani) శుభాకాంక్షలు తెలియజేశారు. క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఎంతో కలిసొస్తోందని అభిమానులు ఫీలవుతున్నారు.

జనసేన సంచలన ఫలితాలు సాధించడానికి ఒక విధంగా క్లీంకార కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. క్లీంకార జాతకం సైతం అద్భుతంగా ఉందని పలువురు పండితులు, జ్యోతిష్కులు వెల్లడించిన సంగతి తెలిసిందే. క్లీంకార సెంటిమెంట్ తో చరణ్ సినిమాలు సైతం హిట్టవుతాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. క్లీంకార ఫేస్ తో పాటు ఫోటోలను రివీల్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ క్లీంకారకు తాను ఆహారం తినిపిస్తానని తాను తినిపిస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. క్లీంకారకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. క్లీంకార పేరు సైతం కొత్తగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus