కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వర్మ లాంటి వాళ్లు ఉపద్రవంపై కూడా తన మార్కు సెటైర్స్స్, జోక్స్ వేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. కరోనా వ్యాప్తి అధికమవుతున్న నాటినుండి ఆయన వరుస ట్వీట్స్ దీనిపై సంధిస్తున్నారు. కరోనా వైరస్ కి దేవుడు కి ఒకటే తేడా కరోనా వైరస్ అందరినీ సమానంగా చూస్తుంది.. కానీ దేవుడు కాదు అని ఒక సెటైర్ వేసిన వర్మ. కరోనా దెబ్బకి గుళ్ళు, మసీదులు, చర్చిలు మూసివేశారు, కానీ హాస్పిటల్స్, పరిశోధనల సంస్థలు మాత్రమే తెరిచివుంచారు.
ప్రజలు వాటి వైపే.. ఆశావాదంతో ఎదురు చూస్తున్నారు, అంటే దేవుడు కాదు..సైన్స్ గొప్ప అని మరో సెటైర్ వేశారు. ఇలా ఈ మధ్య వరుస ట్వీట్స్ తో వర్మ తన మార్కు శాడిజం చూపిస్తున్నాడు. తాజాగా ఆయన కరోనా వైరస్ భార్యలు భగవంతుణ్ణి కోరుకుంటే పంపించాడని చెవుతున్నాడు. దానికి రుజువుగా ఆయన ఐదు కారణాలు చెవుతున్నాడు. మొదటిది స్పోర్ట్స్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి, రెండు బార్ లు క్లబ్ లు బంద్ అయ్యాయి.
అలాగే ఫ్రెండ్స్ తో మీటింగ్స్ వేయడం కుదరదు, ఆఫీస్ లో లేటైంది అని అబద్దం చెప్పడం కుదరదు, చివరిగా అన్నింటి కంటే ముఖ్యమైనది రోజంతా పెళ్లాలతోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వైరస్ భర్తలపై భార్యలకు ఉన్న అసహనం నుండి పుట్టినదే అని ఆయన సెటైర్ పేల్చారు. ఇక ఈ వివాదాల దర్శకుడు ఇటీవల జరిగిన ప్రియాంక రెడ్డి మర్డర్ నిందితుల ఎన్కౌంటర్ పై సినిమా తీస్తాను అని ప్రకటించారు. ఆ నలుగురిలో ఒకరి భార్యను ఆయన స్వయంగా కలవడం జరిగింది.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్