సినిమా టికెట్ ధరల విషయం చర్చించడానికి తనను ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆహ్వానించారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రోజులుగా దర్శకుడు వర్మ, ఏపీ మంత్రి పేర్ని నానిల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై వర్మ సంధించే ప్రశ్నలకు పేర్ని నాని కూడా ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇస్తున్నారు.
అయినప్పటికీ వర్మ తగ్గలేదు. దీంతో ఇక ట్విట్టర్ లో వాధించడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. ఏపీ మంత్రి పేర్ని నాని, వర్మతో భేటీకి పిలుపునిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్ ధరల విషయం గురించి మాట్లాడేందుకు పేర్ని నానిగారు నన్ను ఆహ్వానించారని తెలియజేసేందుకు ఆనందంగా ఉంది. అమరావతి సచివాలయంలో జనవరి 10న మధ్యాహ్నం భేటీ అవుతున్నాం’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు వర్మ. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేర్ని నానికి ధన్యవాదాలు చెప్పారు వర్మ.
అయితే వర్మకి ఈ ఆహ్వానం రావడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏపీలో టికెట్ రేట్ సమస్య ఇప్పటిది కాదని.. ‘వకీల్ సాబ్’ విడుదలైనప్పటి నుంచి రచ్చ జరుగుతూనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు మాట్లాడని వర్మ ఇప్పుడు వరుస ట్వీట్లతో యుద్ధం చేయడం.. మీడియా ముందుకు రావడం.. వెంటనే ఇలా ఇన్విటేషన్ రావడం చూస్తుంటే ఇదేదో ఏపీ ప్రభుత్వం కావాలనే చేస్తున్నట్లుగా అనిపిస్తుందని అంటున్నారు కొందరు నెటిజన్లు.
అంతేకాకుండా.. ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ఈ సమస్యపై మాట్లాడారని.. వారికి రాని ఆహ్వానం వర్మకే ఎందుకు వచ్చినట్లు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి @perni_nani gaaru నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యల కి సంభందించిన వివరణ ఇస్తాను.అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను.
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!