RGV: దేవుడు, సమాజం, కుటుంబాన్ని వదిలేస్తే నాలా బతకొచ్చు:ఆర్జీవి

సంచలనాత్మక దర్శకుడిగా, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడే రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈయన మీడియా సమావేశంలో లేదా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడే మాటలు ఎన్నో వివాదాలకు కారణమవుతుంటాయి.ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో రకాల ప్రశ్నలకు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఇప్పటికే ఎన్నో బయోపిక్ చిత్రాలను తెరకెక్కించిన వర్మ ఫ్యూచర్ లో తన బయోపిక్ చిత్రం వస్తుందా అని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ నేనైతే నా బయోపిక్ చిత్రం చేయను. ఒకవేళ ఎవరైనా చేసిన చాలా బోర్ గా ఉంటుందని వర్మ సమాధానం చెప్పారు. అదేవిధంగా మీ జీవితంలో మీరు సంతోషంగా గడుపుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని, ఇంకా సంతోషంగా గడపడం కోసం ఏమైనా చేస్తానని తెలియజేశారు.

సాధారణంగా రామ్ గోపాల్ వర్మకు బర్తడే అంటే ఇష్టం ఉండదు.. మరి ఈ మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈమధ్య అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైంది, వాళ్ళు తనకు పుట్టిన రోజును చేస్తున్నారని వర్మ సమాధానం చెప్పారు.ఇకపోతే జీవితంలో నీలా బతకాలంటే ఏం చేయాలి అనే మరో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయ్యింది.

Ram Gopal Varma about coronavirus1

ఈ ప్రశ్నకు వర్మ సమాధానం చెబుతూ జీవితంలో నాలా బ్రతకాలంటే కుటుంబం, దేవుడు, సమాజం అనే ఈ మూడు విషయాల్ని వదిలేయాలని, జీవితంలో ఈ మూడు విషయాలు వదిలేస్తే నాలా ఉండగలరు అంటూ వర్మ సమాధానం చెప్పారు.ఇలా మన గురించి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడగగా వర్మ షాకింగ్ సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం వర్మ చెప్పిన ఈ సమాధానాలు వైరల్ అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Share.