RGV: రామ్ గోపాల్ వర్మ మాటలకు సిగ్గుతో మొగ్గలేసిన మరో అమ్మాయి.. వీడియో వైరల్..!

ఒకప్పటి క్రియేటివ్ జీనియస్.. ఇప్పటి కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ అనే కళాఖండాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాడు.. రిజల్ట్ ఎలా ఉన్నా కానీ కంటిన్యూస్‌గా రిలీజులు చేస్తూ తన స్టైల్లో సందడి చేస్తున్నడాయన.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ రీసెంట్‌గా ‘డేంజరస్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు.. ఈ కార్యక్రమంలో ఓ లేడీ ఫ్యాన్ వర్మని హగ్ అడగ్గా.. ఇచ్చాడాయన.. దీంతో ఆ అమ్మాయి పది రోజుల వరకు స్నానం చేయను..

చేస్తే మీరు హగ్ ఇచ్చిన ఫీల్ పోతుంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. ఇక మరో అమ్మాయితో ప్రేమకీ, శృంగారానికీ గల తేడా చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.. దీంతో తను సిగ్గుతో మొగ్గలేసేసింది.. ఇప్పుడీ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డేంజరస్’ మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతకొద్ది కాలంగా వివాదాస్పద చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్న వర్మ.. ఈ సినిమా ట్రైలర్లతోనే రచ్చ లేపాడు.. ‘డేంజరస్’ తో ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాడో చూడాలి మరి..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus