RGV,Ashu Reddy: నచ్చకపోతే చూడొద్దు… అషు రెడ్డి వీడియో గురించి వర్మ క్లారిటీ వీడియో!

రామ్‌గోపాల్‌ వర్మ గురించి ఇటీవల ఓ పోస్ట్‌ బాగా వైరల్‌ అయ్యింది. ‘పది మంది దర్శకులతో సమానమైన వర్మ.. ఓ అమ్మాయి కాలి వేలు నాకడమేంటి?’ అని. ఆ పోస్టు చూసి ఆయనెంత బాధపడ్డారో, నవ్వుకున్నారో, ఇంకేం చేశారో తెలియదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి వర్మ ఎలా అయిపోయారు అంటూ మనసు కష్టపెట్టుకున్నారు. కానీ వర్మ ఆ వీడియో గురించి మరో వీడియో రిలీజ్‌ చేశారు. తను ఎందుకలా అషు రెడ్డితో చేయల్సి వచ్చిందో చెప్పారు.

ఏం చేసినా.. తానే కరక్ట్‌ అనుకునే రకం రామ్‌గోపాల్‌ వర్మ. ఈ మాట మేం అనడం లేదు. ఆయన చేసిన పనులు చూసి చాలామంది నెటిజన్లు అంటున్నారు. తాజాగా ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ చేసి విడుదల చేశారు వర్మ. అందులో టీవీ యాంకర్‌ అషు రెడ్డి.. తొడలు మొత్తం చూపిస్తూ.. కూర్చుంటే ఈయనేమో ఆమె కాళ్ల దగ్గర కూర్చొని ఇంట్వ్యూ ఇచ్చారు. అలా ఎందుకు చేశారు అనేది కొత్తగా ఆయన్ను చూసేవాళ్లకైనా తెలిసిపోతుంది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా వర్మ అషు రెడ్డి కాళ్లను నాకారు. దీంతో ఆ వీడియో వైరల్‌ అయ్యింది.. ఆయన మీద ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది.

తాజాగా ఆ వీడియోపై, ఆయన మీద వస్తున్న ట్రోలింగ్స్‌పై మరో వీడియో విడుదల చేశారు. తన పనిని సమర్థించుకున్నారు. అషు రెడ్డి కాలి బొటన వేలు చీకడం కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ. నేను, అషు రెడ్డి అడల్ట్స్. పూర్తి అంగీకారంతో, ఇద్దరం చేసిన పని అది. మేం మాట్లాడుకున్న మాటలు, మేం చేసిన పనులు పూర్తిగా మా అవగాహనతోనే జరిగాయి. అది మా ఇద్దరి మధ్య వ్యవహారం. మిగతా వాళ్లు చూడొచ్చు, చూడకపోవచ్చు అని తనదైన శైలిలో చెప్పారు వర్మ. తన సినిమాల గురించి కూడా వర్మ ఇలానే మాట్లాడుతుంటారు.

‘‘వినోదం కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. కొందరు సినిమాలు చూస్తారు, కొందరు పబ్‌కి వెళ్తారు. నేను అందమైన అమ్మాయితో ఈ రకమైన ముచ్చట్లు పెడుతుంటాను. మీకు ఈ సమాజంలో నచ్చనవి వందలు, వేలల్లో జరుగుతుంటాయి. అన్నింటినీ ఆపలేరు కదా. ఇది కూడా అలాంటిదే అనుకోండి అని కూడా చెప్పారు. నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. నేను పెట్టిన వీడియోస్ నచ్చకపోతే, ఒక్క క్షణంలో అన్ సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవచ్చు. నేనేం ఫాలోవర్స్ కోసం పాకులాడే రకం కాను అని కూడా అన్నారు వర్మ. కాబట్టి ఇక ఆ వీడియోను, ఆ ఛానల్‌ను ఏం చేయాలో నెటిజన్ల ఇష్టం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus