వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో పలు విషయాలపై వ్యంగ్యంగా స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. వర్మ.. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశారు. అక్కడ తీసిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అందులో ‘రంగీలా’ సినిమా ఒకటి. జాకీ ష్రాఫ్, ఊర్మిళా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
అయితే ఈ సినిమా తరువాత ఆమీర్ ఖాన్ కు, వర్మకు మధ్య విబేధాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా సక్సెస్ తరువాత ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ కంటే వెయిటర్ బాగా నటించాడని కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అలా కొన్ని రోజుల పాటు మాట్లాడుకోలేదని వర్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీడియాలో ఇలాంటి వార్తలు రాగానే.. వెంటనే ఆమీర్ తో మాట్లాడాలనుకున్నానని.. కానీ ఇప్పట్లా అప్పట్లో ఫోన్లు లేవని దీంతో సమస్యను వెంటనే పరిష్కరించుకోలేకపోయామని చెప్పాడు.
అప్పటిలో ఆమీర్ ఖాన్ తనను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టసాగాడని.. ఆ తరువాత ఒకరోజు ఇద్దరం కలుసుకొని అసలు ఏం జరిగిందో చర్చించుకొని విబేధాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పాడు. ఆమీర్ ఖాన్ మంచి నటుడని.. చాలా ఓపికగా ఉంటాడని వర్మ చెప్పుకొచ్చింది. ఆమీర్ పై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఓ సినిమాలో కీలక సన్నివేశం దగ్గర ఆమీర్ కు టెక్నికల్ పాయింట్ ఇచ్చానని.. ఆ సమయంలో కో యాక్టర్ టైమింగ్ వలన ఆమీర్ డైలాగ్ డెలివెరీ బాగా వచ్చిందని తను భావించినట్లు.. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెబితే అది రాయకుండా ఆమీర్ కంటే వెయిటర్ యాక్టింగ్ బాగుందనే టైటిల్ తో ఆర్టికల్ రాశారని అసలు విషయం చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!